Logo
Download our app
ఆయ‌క‌ట్టు రైతుల‌కు నీరందిస్తాం
NEWS   Apr 09,2025 01:39 pm
మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై స‌మీక్ష చేప‌ట్టారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టార‌ని అన్నారు. 2026 జూన్ కల్లా వెలిగొండ రిజర్వాయర్ ను నింపి, ఆయకట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పని చేస్తామ‌న్నారు. జగన్ వెలిగొండను పూర్తి చేసినట్లుగా, జాతికి అంకితం అంటూ, మోసం, దగాతో జనాల్ని భ్రమింప చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. జగన్ ప్రపంచంలో ఎనిమిదో వింత. చేయని పనులు కూడా చేశామని చెప్పుకోవడంలో తనకు తానే సాటి అంటూ ఎద్దేవా చేశారు.
⚠️ You are not allowed to copy content or view source