Logo
Download our app
శ్రీ కోదండ రాముని బ్ర‌హ్మోత్స‌వాలకు విస్తృత ఏర్పాట్లు
NEWS   Apr 09,2025 08:30 am
శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు వెల్లడించారు. శ్రీ సీతారాముల క‌ల్యాణం సంద‌ర్భంగా 11న సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున సీఎం చంద్ర‌బాబు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తారని తెలిపారు. కల్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేశామ‌న్నారు. ⁠ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టిటిడి ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపట్టామ‌న్నారు. తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 క్యూయేస్క్ లు (కౌంటర్లు) ఏర్పాటు చేశామ‌న్నారు. ప్రతి భక్తుడికి ముత్యాల‌ తలంబ్రాలు, శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం, కంక‌ణం, అన్న ప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source