Logo
Download our app
ప్రియాంశ్ ఆర్య సెన్సేష‌న్ సెంచ‌రీ
NEWS   Apr 08,2025 08:38 pm
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ క్రికెట‌ర్ ప్రియాంశ్ ఆర్య అద్భుతంగా ఆడాడు. చెన్నై బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. 43 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 103 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేశాడు. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్ లో విజ‌య్ శంక‌ర్ క్యాచ్ ప‌ట్ట‌గా ఔట్ అయ్యాడు. 14 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి పంజాబ్ 154 ర‌న్స్ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source