Logo
Download our app
పోరాడి ఓడిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్
NEWS   Apr 08,2025 07:36 pm
ఐపీఎల్ 2025లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ ఆద్యంత‌మూ ఉత్కంఠ భ‌రితంగా సాగింది. గెలుపుకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఓట‌మి చ‌వి చూసింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. క్రీజులో రింకూ సింగ్ ఉన్నా ఫ‌లితం లేకుండా పోయింది. 239 ప‌రుగుల ల‌క్ష్యంతో మైదానంలోకి దిగిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 7 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. సునీల్ నారాయ‌ణ్ 13 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 30 ర‌న్స్ చేయ‌గా కెప్టెన్ అజింక్యా ర‌హానే 61 ప‌రుగులు చేశాడు. 35 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్స్ లు చేశాడు. వెంక‌టేశ్ అయ్య‌ర్ 6 ఫోర్లు ఓ సిక్స్ తో 45 ర‌న్స్ చేయ‌గా ఆఖ‌రులో రింకూ సింగ్ మెరుపులు మెరిపించాడు. త‌ను 24 ర‌న్స్ కొట్టాడు. అయినా ఫ‌లితం లేక పోయింది.
⚠️ You are not allowed to copy content or view source