Logo
Download our app
కోల్ క‌తా భ‌ర‌తం ప‌ట్టిన పూర‌న్
NEWS   Apr 08,2025 05:13 pm
ఐపీఎల్ 2025లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ భారీ స్కోర్ సాధించింది. కోల్ క‌తా స్కిప్ప‌ర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మార్క్రామ్ 28 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 47 రన్స్ చేయ‌గా మిచెల్ మార్స్ సూప‌ర్ గా ఆడాడు. 48 బాల్స్ ఎదుర్కొని 6 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 81 ర‌న్స్ చేశాడు. కోల్ క‌తాకు చుక్క‌లు చూపించాడు. మైదానంలోకి వ‌చ్చిన నికోల‌స్ పూరన్ దంచి కొట్టాడు. కోల్ క‌తా బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. కేవ‌లం 33 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 7 ఫోర్లు 8 సిక్స‌ర్ల‌తో 86 ర‌న్స్ చేశాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్లు కోల్పోయి 238 ర‌న్స్ చేసింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్.
⚠️ You are not allowed to copy content or view source