Logo
Download our app
12న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
NEWS   Apr 07,2025 05:48 pm
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసి వున్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఏప్రిల్ 12న జరుగనుంది. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
⚠️ You are not allowed to copy content or view source