Logo
Download our app
వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం
NEWS   Apr 07,2025 05:44 pm
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా రెండో రోజు సోమవారం వేణు గానాలంకారంలో స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.
⚠️ You are not allowed to copy content or view source