Logo
Download our app
టీటీడీకి రూ.కోటి విరాళం
NEWS   Apr 07,2025 05:29 pm
తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. సోమ‌వారం స్వామి వారికి ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source