Logo
Download our app
రాములోరి క‌ళ్యాణోత్స‌వానికి ఏర్పాట్లు
NEWS   Apr 07,2025 05:12 pm
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా స‌మీక్ష చేప‌ట్టారు. రాష్ట్ర విభజన అయ్యాక రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో టిటిడిలో విలీనం చేశారని అన్నారు. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం సూచనలతో తొలిసారి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source