Logo
Download our app
తిరువ‌ణ్ణామ‌లై స‌న్నిధిలో హోం మంత్రి
NEWS   Apr 07,2025 02:59 pm
హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత కుటుంబ స‌భ్యుల‌తో తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. అక్క‌డి నుంచి నేరుగా త‌మిళ‌నాడులోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం తిరువ‌ణ్ణామ‌లై అరుణాచ‌లేశ్వ‌రుడిని ద‌ర్శించుకుని పూజ‌లు చేశారు. మంత్రికి సాద‌ర స్వాగ‌తం ప‌లికారు ఆల‌య క‌మిటీ చైర్మ‌న్, పూజారులు. వేద పండితులు ఆశీర్వ‌చ‌నం అంద‌జేశారు. స్వామి వారి ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. మనలోని అహాన్ని తొలగించేందుకు అగ్నిలింగంగా వెలసిన అరుణాచల క్షేత్ర దర్శనం క‌ల‌గ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు అనిత వంగ‌ల‌పూడి.
⚠️ You are not allowed to copy content or view source