Logo
Download our app
పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భ‌రోసా లేదు
NEWS   Apr 07,2025 06:56 am
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేరుకు రైజింగ్ స్టేట్ కానీ వైద్య సేవలకు దిక్కు లేద‌న్నారు. పేదోడి ఆరోగ్యానికి రాష్ట్రంలో భరోసా లేకుండా పోయింద‌న్నారు. ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఆరోగ్య శ్రీ సేవల కింద రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గు చేటు అన్నారు. గత 9 నెలలుగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయకుండా ఉండ‌డం దారుణ‌మ‌న్నారు.వైద్య సేవలు ఆపేదాక చూడటం అంటే, ఆరోగ్యశ్రీ పై సర్కారుకున్న చిత్తశుద్ది ఏంటో అర్థమౌతుందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source