Logo
Download our app
చింత‌న్ శివిర్ కు పొన్నం..సీత‌క్క‌
NEWS   Apr 06,2025 04:12 pm
మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, దాస‌రి సీత‌క్క డెహ్రాడూన్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈనెల 7,8 తేదీల‌లో సామాజిక న్యాయం సాధికార‌త‌పై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ అధ్య‌క్ష‌త‌న డెహ్రాడూన్ లో చింత‌న్ శివిర్ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు చెందిన మంత్రులు పాల్గొంటారు. రెండు రోజుల పాటు జ‌రుగుతుంది ఈ స‌మావేశం. తెలంగాణలో వెనకబడిన తరగతులు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన ఇతర కార్యక్రమాల గురించి మంత్రులు వివ‌రిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source