LIVE: సీతారాముల కల్యాణం చూతము రారండి
NEWS Oct 08,2025 11:07 am
వేదిక భద్రాచలం, మిధిలా స్టేడియం. పెళ్లికొడుకు శ్రీరామచంద్రమూర్తి. పెళ్లికూతురు జనకపుత్రి సీతాదేవి. లగ్నం…అభిజిత్. ఈ పెళ్లికి అందరూ ఆహ్వానితులే. భద్రాచల రామయ్యా…అందరి బంధువయా. సీతారాముల పెళ్లికి ఇవాళ జగమంతా భద్రాద్రికి తరలివస్తోంది. అన్ని దారులు భద్రాద్రికే దారి తీస్తున్నాయి. ఈ కల్యాణం.. రమణీయం కమనీయం అనీర్వచనీయం.