Logo
Download our app
అభివృద్ది ప‌థంలో ఏపీ ముందుండాలి
NEWS   Apr 06,2025 10:19 am
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుండాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఆ దేవ దేవుడిని కోరుకున్నాన‌ని అన్నారు. విజన్‌- 2047, పీ-4 విధానంతో బంగారు కుటుంబాలను అభివృద్ధిలోకి తీసుకు రావాలన్నదే సీఎం లక్ష్యమని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామి వారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
⚠️ You are not allowed to copy content or view source