దేశమంతటా శ్రీరామ నవమి
NEWS Apr 06,2025 09:47 am
దేశ వ్యాప్తంగా శ్రీరామనవమి పర్వదినాన్ని నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆలయాలన్నీ శోభాయమానంగా అలరారుతున్నాయి. భద్రాచలం, ఒంటిమిట్ట, అయోధ్య రామ మందిరం, తిరుమలలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది. భద్రాచల రాములోరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది కళ్యాణ కార్యక్రమానికి.