Logo
Download our app
ఫామ్ లోకి వ‌చ్చిన య‌శ‌స్వి జైశ్వాల్
NEWS   Apr 06,2025 09:28 am
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 205 ర‌న్స్ చేసింది. ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ ల‌లో తీవ్ర నిరాశ ప‌రిచాడు యశ‌స్వి జైశ్వాల్. కెప్టెన్ సంజూ శాంస‌న్ తో క‌లిసి జైశ్వాల్ తొలి వికెట్ కు భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. య‌శ‌స్వి 3 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 67 ర‌న్స్ చేశాడు. సంజూ శాంస‌న్ 38 ప‌రుగులతో ఆక‌ట్టుకున్నాడు. ఫెర్గూస‌న్ బౌలింగ్ లో సిక్స్ కొట్ట‌బోయి అయ్య‌ర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత బ‌రిలోకి దిగిన రియాన్ ప‌రాగ్ సూప‌ర్ షో చేశాడు. 47 ర‌న్స్ చేశాడు.
⚠️ You are not allowed to copy content or view source