Logo
Download our app
సిఫార్సు లేఖల కోసం ప్రత్యేక వెబ్ సైట్
NEWS   Apr 05,2025 03:04 am
టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తిరుమ‌ల ద‌ర్శ‌నం కోసం తెలంగాణ ప్ర‌జా ప్ర‌తినిధుల నుంచి వ‌చ్చే సిఫార్సు లేఖ‌ల కోసం ప్ర‌త్యేకంగా వెబ్ సైట్http://cmottd.telangana.gov.in/URL ను రూపొందించింది. దీని నుంచే సిఫార్సు లేఖలు ఇవ్వనున్నారు. ఇందులో వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం, రూ. 300 ప్ర‌త్యేక ద‌ర్శ‌నం మాత్ర‌మే ఇస్తామ‌ని పేర్కొంది టీటీడీ. లేఖ‌ల కోసం విధి విధానాల‌ను ఖ‌రారు చేసింది. ప్రతి ప్రజా ప్రతినిధికి రోజుకు ఒక లేఖ పరిమితితో సోమవారం నుండి గురువారం వరకు మాత్రమే సిఫార్సు లేఖలు జారీ చేయబడతాయి.
⚠️ You are not allowed to copy content or view source