Logo
Download our app
శ్రీవారి భక్తులకు అందుతున్న సేవలపై ఈవో స‌మీక్ష
NEWS   Apr 05,2025 02:40 am
కలియుగ దైవం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు కల్పిస్తున్న సేవలు, భక్తుల నుండి వస్తున్న సూచనలు , ఫిర్యాదులపై టిటిడి ఈవో జే. శ్యామల రావు సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలు సంతృప్తికరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లలో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీలో భక్తుల నుండి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి సమగ్ర విశ్లేషణాత్మక నివేదిక రూపొందించాలన్నారు. లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసే కౌంటర్ల వద్ద భక్తులకు ఆలస్యం చేయకుండా పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
⚠️ You are not allowed to copy content or view source