Logo
Download our app
ముగిసిన శ్రీ కోదండ‌రామ స్వామి ఉత్స‌వాలు
NEWS   Apr 05,2025 02:33 am
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 8.30 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గరుడ పటాన్ని అవతనం చేశారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తుల తూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్య పదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం . ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source