మోసం చేయడం జగన్ నైజం
NEWS Apr 05,2025 02:28 am
మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. మోసం చేయడం జగన్ నైజం అన్నారు. వైపీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. మాట తప్పడం మడమ తిప్పడం జగన్ పేటెంట్ అంటూ ఎద్దేవా చేశారు. ఇది జగమెరిగిన సత్యం. గతంలో నా మైనారిటీలు, నా ముస్లింలు అని పదే పదే చెప్పి వాళ్ళ ఓట్లు దండుకొని అందలం ఎక్కారంటూ ఆరోపించారు. నేడు మళ్లీ వారి ఓట్ల కోసం జగన్ రెడ్డి రకరకాల నాటకాలు ఆడుతున్నాడంటూ మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా ముస్లింలకు జగన్ ద్రోహం చేశాడన్నారు. ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైందన్నారు.