Logo
Download our app
కొత్త రూ.500..రూ.10 నోట్లు : ఆర్‌బిఐ ప్రకటన
NEWS   Apr 05,2025 09:51 am
కొత్త 500, 10 రూపాయల కరెన్సీ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. గాంధీ చిత్రాలను కలిగి ఉన్న ప్రస్తుత కరెన్సీ నోటు డిజైన్‌లో ఏదైనా మార్పు ఉండ‌బోతోంద‌ని తెలిపింది. కొత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ మల్హోత్రా సంతకం కొత్త నోట్లపై కనిపిస్తుంది.పాత నోట్లు కూడా పనిచేస్తాయి. 100, 200 రూపాయల నోట్లు కూడా త్వరలో ప్రవేశ పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా ఇవి మల్హోత్రా సంతకంతో విడుదల కానున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source