Logo
Download our app
ఘ‌నంగా కోదండ‌రాముడి చ‌క్ర‌స్నానం
NEWS   Apr 04,2025 02:33 pm
తిరుపతి లోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్ర పర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ మండపంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకాలు అందుకుని ప్రసన్నులయ్యారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source