Logo
Download our app
అశ్వ వాహనంపై శ్రీరామచంద్రుడి వైభవం
NEWS   Apr 04,2025 02:24 pm
తిరుపతిలోని శ్రీ కోదండ రామ స్వామి వారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఎనిమిదో రోజు స్వామి వారు అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source