Logo
Download our app
రామాలయం వ‌ద్ద‌ పారిశుద్ధ్య పనులు షురూ
NEWS   Apr 04,2025 11:28 am
శ్రీరామనవమి పండుగ పురస్కరించుకొని ఎస్సారెస్పీ క్యాంప్‌ శ్రీ కోదండ రామాలయం లోపల బయట పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మోహన్ పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించిన్టు తెలిపారు. పట్టణంలో మిగతా ఆలయాల్లోనూ పారిశుద్ధ పనులు చేపడుతామ‌న్నారు. కార్యక్రమంలో అధికారులు, రత్నాకర్, విష్ణు, ముజీబ్, నిజం, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source