Logo
Download our app
మంత్రులు..ఎమ్మెల్యేలు ప‌ల్లె నిద్ర చేయాలి
NEWS   Apr 04,2025 09:35 am
ఏపీ సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నాలుగు రోజుల పాటు ప‌ల్లెల్లో నిద్ర చేయాల‌ని ఆదేశించారు. త‌న ఆధ్వ‌ర్యంలో కేబినెట్ మీటింగ్ జ‌రిగింది. కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను గుర్తించాల‌ని, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు సీఎం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో లబ్దిదారులు అత్యధికంగా ఉన్నార‌ని, అయినా సంక్షేమ పథకాలు కొన‌సాగిస్తున్నామ‌న్నారు. చేసిన మంచి పనులకు విస్తృత ప్రచారం కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source