Logo
Download our app
ఆస్తులు ప్ర‌క‌టించేందుకు జడ్జీలు రెడీ
NEWS   Apr 03,2025 12:32 pm
సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. న్యాయ‌స్థానాల‌లో కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను నిర్వ‌హిస్తున్న జ‌డ్జీలంతా త‌మ ఆస్తుల‌ను ప్ర‌క‌టించాల‌ని ఆదేశించింది . ఈ మేర‌కు ఈ తీర్మానానికి అంద‌రూ ఏక‌గ్రీవంగా ఓకే చెప్పారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తి ఇంట్లో భారీ ఎత్తున నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట ప‌డ‌డంతో పెద్ద ఎత్తున న్యాయ వ్య‌వ‌స్థ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ త‌రుణంలో సీజేఐ ఆదేశాల మేర‌కు ఎవ‌రెవ‌రికి ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయ‌నే దానిపై బ‌హిరంగంగా ప్ర‌క‌టించాల‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ప్ర‌తి ఒక్క‌రు ఆమోదం తెల‌పాల‌ని కోరారు. ఇందుకు జ‌డ్జీలంతా త‌మ ఆస్తుల‌ను ప్ర‌క‌టించేందుకు ముందుకు వ‌స్తామ‌ని ప్ర‌క‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source