Logo
Download our app
భూముల వేలం ప‌ర్యావ‌ర‌ణం నాశ‌నం
NEWS   Apr 03,2025 07:56 am
బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జీరో అవ‌ర్ లో ఆయ‌న పార్ల‌మెంట్ లో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన 400 ఎక‌రాల భూముల వేలంపై ప్ర‌స్తావించారు. ఇది పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌య‌మ‌న్నారు. కాంగ్రెస స‌ర్కార్ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. వేలం పాట వేయ‌డం వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తింటోంద‌ని వాపోయారు. వందల రకాల జంతు జాతులు, వృక్ష జాతులు ఉన్నాయని, వాటిని కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. ఇప్పటికే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. త‌మ పార్టీ వారికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇస్తోంద‌న్నారు. వాళ్ళ స్వంత అవసరాల కోసం నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం లేద‌న్నారు. ఆక్సిజ‌న్ ద‌క్క‌కుండా పోయే ప్ర‌మాదం ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source