Logo
Download our app
స్పీక‌ర్ మౌనంగా ఉంటే కోర్టు ఊరుకోవాలా..?
NEWS   Apr 02,2025 12:30 pm
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. ఈ కేసుకు సంబంధించి బుధ‌వారం తీవ్ర వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ త‌ర‌పున ప్ర‌ముఖ న్యాయ‌వాది ముకుల్ రోహ‌త్గీ వాద‌న‌లు వినిపించారు. స్పీక‌ర్ కు రాజ్యాంగం విశేష అధికారాలు క‌ల్పించింద‌ని, కోర్టులు హ‌రించ లేవ‌న్నారు. స్పీక‌ర్ ఒక‌సారి నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాతే జ్యూడిషియ‌ల్ స‌మీక్ష‌కు ఛాన్స్ ఉంటుంద‌న్నారు. కాల ప‌రిమితితో నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర్టు చెప్ప‌డం భావ్యం కాద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source