Logo
Download our app
6 నుంచి ఒంటిమిట్ట‌లో బ్ర‌హ్మోత్స‌వాలు
NEWS   Apr 02,2025 08:20 am
ఒంటిమిట్ట లోని శ్రీ కోదండ రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆల‌య పూజారులు కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఉత్స‌వాల‌లో భాగంగా 6న ఉద‌యం ధ్వ‌జారోహ‌ణం , రాత్రి శేష వాహ‌నం, 7న వేణుగానాలంకారం, హంస వాహ‌నం, 8న ఉద‌యం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హ‌నుమంత వాహ‌నం,9న ఉద‌యం నవనీత కృష్ణాలంకారం , రాత్రి హనుమంత వాహనంతో పాటు ఈనెల 14వ తేదీ వ‌ర‌కు వాహ‌న సేవ‌లు నిర్వ‌హించ‌నున్నారు.
⚠️ You are not allowed to copy content or view source