Logo
Download our app
కోరుట్ల వాసికి హైద‌రాబాద్‌లో సన్మానం
NEWS   Apr 01,2025 09:59 pm
కోరుట్ల పట్టణానికి చెందిన కళాకారుడు, కోరుట్ల బ్రహ్మణ సేవాపరిషత్ ప్రధానకార్యదర్శి కలకుంట్ల నితిన్ కుమార్ ఆచార్యను హైద‌రాబాద్ లో జాతీయ సాహిత్య పరిషత్ నిర్వహణలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమంలో సన్మానించారు. నితిన్ కుమార్ రాసిన కవితను కవిత సంకలనం పుస్తకంలో జాతీయ సాహిత్య పరిషత్ వారు ప్రచురించారు. తనకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను రాసిన కవితని నితిన్ కుమార్ విచ్చేసిన అతిథుల ముందు చదివి వినిపించగా జ్ఞాపిక, శాలువా, గ్రంథాలతో సత్కరించి, అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source