Logo
Download our app
లైంగిక దాడుల‌పై మంత్రి సీత‌క్క సీరియ‌స్
NEWS   Apr 01,2025 06:32 pm
మంత్రి సీత‌క్క సీరియ‌స్ అయ్యారు. ఊరుకొండ‌పేట‌, హైద‌రాబాద్ లైంగిక దాడుల ఘ‌ట‌న‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సంబంధిత పోలీస్ , మ‌హిళా సంక్షేమ అధికారుల‌తో మాట్లాడారు. లైంగిక దాడుల‌కు పాల్ప‌డిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌న్నారు. దాడుల‌తో సంబంధం ఉన్న నిందితులంద‌రినీ గంట‌ల వ్య‌వ‌ధిలోనే అరెస్ట్ చేశామ‌న్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సఖి సెంటర్ సంరక్షణలో బాధితులను సంరక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు సీత‌క్క‌.
⚠️ You are not allowed to copy content or view source