Logo
Download our app
గరుడ వాహనంపై లోకాభి రాముడు
NEWS   Apr 01,2025 07:43 am
తిరుపతిలోని ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఐదో రోజు సోమ‌వారం రాత్రి స్వామి వారు గరుడ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భ‌క్తులు స్వామిని ద‌ర్శించు కునేందుకు పోటెత్తారు.
⚠️ You are not allowed to copy content or view source