Logo
Download our app
దుష్ప్ర‌చారం అబ‌ద్దం ఆ భూములు మావే
NEWS   Apr 01,2025 07:26 am
గ‌చ్చిబౌలి లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ భూముల వ్య‌వ‌హారం వివాదాస్ప‌దంగా మారింది. 400 ఎక‌రాలు తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందినేవ‌నంటూ పేర్కొంది. ఇదే స‌మ‌యంలో టీజీఐఐసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. హెచ్ సీ యూ ప్రాంగ‌ణంలో భూముల‌కు సంబంధించి స‌ర్వే చేశామ‌ని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఎలాంటి స‌ర్వే చేప‌ట్ట లేద‌ని పేర్కొంది. ఇప్పటివరకు భూమికి చెందిన స్థలాకృతిని మాత్రమే ప్రాథమికంగా తనిఖీ మాత్రమే చేయడం జ‌రిగింద‌ని తెలిపింది. త‌మ వివ‌ర‌ణ తీసుకోకుండా, సంప్ర‌దించ‌కుండా త‌ప్పుడు వార్త‌లు రాయ‌వ‌ద్దంటూ సూచించింది యూనివ‌ర్శిటీ
⚠️ You are not allowed to copy content or view source