Logo
Download our app
ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌జా పాల‌న
NEWS   Apr 01,2025 06:47 am
ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, ఆశ‌ల‌కు అనుగుణంగా కూట‌మి స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్. అందుకే జ‌గ‌న్ రెడ్డికి కోలుకోలేని షాక్ ఇచ్చార‌ని, ఆయ‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేశార‌ని మండిప‌డ్డారు. కూట‌మికి ఏకంగా 94 శాతం సీట్ల‌తో విప్ల‌వాత్మ‌క‌మైన విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్దఎత్తున అభివృద్ధి జ‌రుగుతోంద‌న్నారు. అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. యలమంచిలి ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source