Logo
Download our app
తెలంగాణ‌లో 180 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల బియ్యం
NEWS   Mar 31,2025 05:36 pm
తెలంగాణ‌లో 180 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుంద‌న్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నామ‌ని చెప్పారు. తొలి విడతగా 12500 టన్నుల బియ్యం పంపిస్తున్నామ‌ని అన్నారు . ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు మంత్రి. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్ కు తెలంగాణ బియ్యం పంపిణీ కార్య‌క్ర‌మానికి సోమ‌వారం శ్రీ‌కారం చుట్టారు.
⚠️ You are not allowed to copy content or view source