వైసీపీ కార్యకర్త హత్య దారుణం - జగన్
NEWS Mar 31,2025 03:38 pm
మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త లింగమయ్యను దారుణంగా హత్య చేయడం పట్ల తీవ్ర ఆవేదన చెందారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. బీసీ కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చట్టబద్ధ పాలన లేదని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు, వారి దాడులను వ్యతిరేకించినందుకు టీడీపీ నాయకులు భూమి మీద లేకుండా చేశారని ఆరోపించారు జగన్ రెడ్డి.