Logo
Download our app
శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
NEWS   Mar 31,2025 03:29 pm
ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో ఏప్రిల్ 5 నుండి 15 వరకు జరుగనున్న శ్రీ కోదండరామ స్వామి ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పనులను టిటిడి జేఈవో వి వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా కల్యాణ వేదిక ప్రాంగణానికి చేరిన జేఈవో ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కల్యాణ వేదిక పక్కన ఉన్న పీఏసీ బిల్డింగ్ పనులను పరిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source