Logo
Download our app
దేశ వ్యాప్తంగా టోల్ ఛార్జీల పెంపు
NEWS   Mar 31,2025 02:53 pm
వాహ‌న‌దారుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్రం. ఇదే స‌మ‌యంలో అద‌ను చూసి పెంచింది హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌. ఔట‌ర్ రింగ్ రోడ్డు పై వాహ‌నాల‌కు సంబంధించి టోల్ చార్జీల‌ను 5 శాతం పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ రేట్లు వ‌ర్తిస్తాయ‌ని పేర్కొంది. ఇదే స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా ఉన్న టోల్ గేట్ల‌లో ఛార్జీలు పెరిగాయి. అన్ని జాతీయ ర‌హ‌దారుల‌లోని టోల్ ప్లాజాల్లో ఆరు శాతం ఛార్జీలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా చార్జీలను పెంచింది టోల్ అభివృద్ధి సంస్థ.
⚠️ You are not allowed to copy content or view source