Logo
Download our app
కేసీఆర్ కు ప‌ట్టిన గతే వీళ్లకు ప‌డుతుంది
NEWS   Mar 31,2025 02:38 pm
బీజేపీ ఎంపీ ఈటెల రాజేంద‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ లోని గ‌చ్చిబౌలి లో 400 ఎక‌రాల విష‌యంలో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళ‌న మ‌రింత ఉద్రిక్తంగా మార‌క ముందే ప్ర‌భుత్వం త‌న తీరును మార్చుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. హెచ్ సీ యూ విద్యార్థుల ప‌ట్ల స‌ర్కార్ అనుస‌రిస్తున్న వైఖ‌రి దారుణ‌మ‌న్నారు. త్వ‌ర‌లోనే కేసీఆర్ కు ప‌ట్టిన గ‌తే కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వానికి ప‌డుతుంద‌ని హెచ్చ‌రించారు. ఈ విష‌యంపై రాహుల్ గాంధీ వెంట‌నే స్పందించాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source