నితీష్ రాణా సూపర్ షో
NEWS Mar 31,2025 07:50 am
ఐపీఎల్ 2025లో భాగంగా గౌహతి వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన షో ప్రదర్శించాడు రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేయర్ నితీష్ రాణా. జైశ్వాల్ మరోసారి నిరాశ పరిచాడు. అనంతరం సంజూ శాంసన్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు రాణా. కేవలం 36 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 20 పరుగులకే సంజూ శాంసన్ చాప చుట్టేయడంతో బరిలోకి దిగిన స్టాండింగ్ కెప్టెన్ రియాన్ పరాగ్ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. తను 28 బాల్స్ లు ఎదుర్కొని 37 రన్స్ చేశాఢు.