రాజీవ్ యువవికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
NEWS Mar 31,2025 08:06 am
NRPT: యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 5 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.