Logo
Download our app
బండి కామెంట్స్ సీత‌క్క కౌంట‌ర్
NEWS   Mar 30,2025 06:30 pm
మంత్రి దాస‌రి సీత‌క్క నిప్పులు చెరిగారు. తెలంగాణ‌లో స‌న్న బియ్యం పంపిణీని కేంద్ర స‌ర్కారే ఇస్తోందంటూ కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ చెప్ప‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. 2013లో దేశంలో ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మ‌న్న సంగ‌తి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో ఎందుకు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన రాలేదంటూ ప్ర‌శ్నించారు. ప్రధాని మోదీ ఫోటో పెట్టాలన్న బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source