మయన్మార్‌లో మృత్యు విలయం
NEWS Mar 29,2025 08:03 pm
భూకంపం ధాటికి మయన్మార్ మృత్యు వలయంగా మారింది. మూడు సార్లు భూమి కంపించింది. దీని కారణంగా ఇప్పటి వరకు 694 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1600 మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం ధాటికి భవనాలు కుప్ప కూలాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరో వైపు బ్యాంకాక్, థాయ్ లాండ్ లో ఎర్త్ క్వేక్ చోటు చేసుకుంది. 10 మంది మృతి చెందగా 100 మందికి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య భారీగా పెరగనుంది. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు.