Logo
Download our app
పాఠశాలలో ముందస్తు ఉగాది సంబరాలు
NEWS   Mar 29,2025 05:07 pm
కోరుట్ల: SRSP క్యాంప్ గడి ప్రాథమిక పాఠశాలలో ఉగాది పండుగ ముందస్తు వేడుకలు వైభవంగా జరిగాయి. ఉగాది పచ్చడి విద్యార్థులతో తయారు చేయించి షడ్రుచుల ఉగాది పచ్చడి విశిష్టతను ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు వివరించారు. జీవితంలో భిన్న పరిస్థితులను అధిగమించి సంతోషంగా గడపాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచించారు. వేడుకలో ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేఖ, సుమలత, విద్యార్థులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source