Logo
Download our app
జ‌గ‌న్ స‌ర్కార్ వ‌ల్లే రెవెన్యూ స‌మ‌స్య‌లు
NEWS   Mar 29,2025 01:56 am
మంత్రి నారాయ‌ణ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి పై మండిప‌డ్డారు. ఆయ‌న ప్ర‌భుత్వ హ‌యాంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం అయ్యాయ‌ని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల రెవెన్యూ సమస్యలు పెరిగాయని మండిప‌డ్డారు. ప్రభుత్వ దృష్టికి వచ్చే సమస్యల్లో 80 శాతం ఇవే ఉంటున్నాయ‌ని చెప్పారు. సర్వేయర్లను బదిలీ చేసి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించామ‌న్నారు. భారీగా అప్పులు మాత్రమే కాకుండా చెత్తను కూడా మిగిల్చి వెళ్లిందంటూ ఎద్దేవా చేశారు. .రాష్ట్ర వ్యాప్తంగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి చెత్తను పూర్తి స్థాయిలో తొలగించే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.బలభద్రపురంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుపై స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడానన‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source