ఏప్రిల్ 1న ఒంటిమిట్ట లో ఆళ్వార్ తిరుమంజనం
NEWS Mar 29,2025 01:42 am
ఒంటిమిట్ట ఏకశిలా నగరంలోని శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరుగనుంది. ఆలయంలో ఏప్రిల్ 05 నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.