Logo
Download our app
విద్యుత్ శాఖ స‌ద‌స్సుకు గొట్టిపాటి
NEWS   Mar 29,2025 01:11 am
లఖ్‌నవూ వేదికగా శనివారం జరగనున్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరుకానున్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం లో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ శాఖ మంత్రులు హాజరు కానున్నారు. ఆయా రాష్ట్రాల్లో డిస్కంల ఆర్థిక ప‌రిస్థితుల ఈ సమావేశంలో మంత్రులు చర్చించనున్నారు. బకాయిల కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన డిస్కంలను ఏ విధంగా లాభాల బాట పట్టించి ముందుకెళ్లాల‌నే అంశాలపై మంత్రులు, సంబంధిత అధికారులు సమాలోచనలు చేయనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source