Logo
Download our app
200 ఎక‌రాల్లో ఏఐ సిటీ నిర్మాణం
NEWS   Mar 29,2025 12:22 am
క్లియ‌ర్ టెల్లిజెన్స్ ఇండియా డెలివ‌రీ అండ్ ఆప‌రేష‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు.ఉగాది తర్వాత మహేశ్వరంలో ఏఐ సిటీ నిర్మాణానికి భూమి పూజ చేస్తామ‌న్నారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామ‌న్నారు. ఇక్కడే 200 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏఐ సిటీని నిర్మిస్తామ‌న్నారు. ఈ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయ‌ని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో తెలంగాణ హబ్ గా మారుతోందన్నారు.
⚠️ You are not allowed to copy content or view source