Logo
Download our app
బెంగ‌ళూరు చేతిలో చెన్నై చిత్తు
NEWS   Mar 29,2025 12:09 am
ఐపీఎల్ 2025లో భాగంగా జ‌రిగిన 8వ లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. 197 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ 8 వికెట్లు కోల్పోయి 146 ప‌రుగులే చేసింది. దీంతో 50 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఆర్సీబీకి ఇది వ‌రుస‌గా రెండో విజ‌యం కావ‌డం విశేషం. టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ కోల్ క‌తాలో ఆడింది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ను ఈడెన్ గార్డెన్స్ లో ఓడించింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నైని క‌ట్ట‌డి చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి చెన్నై ప్లేయ‌ర్లు ఆశించిన మేర ఆడ‌లేక పోయారు. చివ‌ర‌లో వ‌చ్చిన ధోనీ మెరిసినా ఫ‌లితం లేక పోయింది.
⚠️ You are not allowed to copy content or view source