థాయ్ లాండ్ లో భూకంపం..ఎమర్జెన్సీ
NEWS Mar 28,2025 02:46 pm
మయన్మార్ లో భారీ భూకంపం సంభవించింది. 15 మందికి పైగా మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. తొలి భూకంప తీవ్రత 7.7గా నమోదు కాగా రెండో భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. భూకంపం దెబ్బకు బ్యాంకాక్ లో రైల్వే, మెట్రో సేవలను నిలిపి వేశారు. మాండేలాలో చారిత్రాత్మకమైన అవా వంతెన కూలి పోయింది. థాయి లాండ్ లోనూ భారీ భూకంపం సంభవించింది. పలు బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ప్రధానమంత్రి.